Sunday, February 12, 2012

పెద్దపులి

ప్రకృతి నైజం అంటుంది
ప్రజలను గడగడ వణికిస్తుందొక పులి
.... అది.... చలిపులి.

విశాఖవాసులను హడలెత్తిస్తూ
దారి తప్పి, మానవ కీకారణ్యంలో పడనందుకు
చింతిస్తూ బెంబేలెత్తుతున్నదొక పులి
.... అది.... చిరుతపులి.

"జూ" లో సిబ్బందిని యిబ్బంది పెడ్తూ
యిక్కట్లకు గురిచేస్తున్నదొక పులి
.... అది.... పొగరు పులి.

వీటన్నింటికన్నా భయంకరమైనదొక పులి
.... అది.... పెద్దపులి.

’భారతి’నే చిన్నాభిన్నం చేస్తూ
’భిన్నత్వంలో ఏకత్వం’ అన్న
సిధ్ధాంతాన్నే రాధ్ధాంతం చేసే
రాక్షస రక్కసే ఈ పెద్దపులి
’రజకీయం’ దాని పంజా
’మతోన్మాదం’ దాని కోరలు
’అహం’ దాని అభిమతం

ఆ పెద్దపులి చేసే వథలో
గొఱ్ఱేలనే మైనారిటీల మనోవ్యధ
గుజరాత్ గొర్రెల గుండెకాయల్ని
చీల్చీ చెండాడే రాక్షస రక్కసి
మఠకన్యలను చెరచడం
మతగురువులను నగ్నంగా
నగర నడిబొడ్డున నడిపించడం
విద్యాలయాలను మూయించడం
దేవాలయాలను తగలబెట్టడం
కావా యివి రాక్షస రక్కసి చేసే
వికృత విపరీత చర్యలు.

No comments:

Post a Comment